Hyd, Oct 9: సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి అని తెలిపారు. ఈ సారి పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయిందని...రేవంత్ పాలనలో రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అక్రమంగా భూములు గుంజుకోవద్దంటూ మా పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధర్నా చేస్తే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడ రైతుల మీద లాఠీ ఛార్జి చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
ముఖ్యమంత్రి నీ కొడంగల్ నియోజకవర్గంలోనే ప్రజలను ఒప్పించకపోతే రాష్ట్రాన్ని ఎట్ల నడిపిస్తావ్? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకొని అరాచకాలు చేస్తావ్?..ప్రజాభిప్రాయం మేరకే వాళ్లను ఒప్పించి, మెప్పించి ఏ పరిశ్రమ అయిన పెట్టాలన్నారు. మా పార్టీ నేత నరేందర్ రెడ్డి తో సహా మీరు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, పాదయాత్రకు బయలుదేరుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Here's Video:
ఒకవేళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి.
ఈ సారి పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయింది.
రేవంత్ పాలనలో రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు.
- బీఆర్ఎస్ వర్కింగ్… pic.twitter.com/MtFwz95daa
— BRS Party (@BRSparty) October 9, 2024
పోలీస్ రాజ్యంగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గం కు వెళుతుంటే అడ్డుకుంటారా... మా నియోజకవర్గం కు వెళుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం ఎంటి...ఎవరు చెప్పినా ఆగేది లేదు అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రభాకర్ రెడ్డి. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడం తో ఈవిషయమై డిసిపీ జయరాం తో మాట్లాడం జరిగిందన్నారు. నియోజకవర్గం వెళుతుంటే అడ్డుకుంటున్నారని, కనీసం మాదాపూర్ లోని మా కార్యాలయం కు నైనా వెళ్లనివ్వాలి..తెలంగాణ లో కాంగ్రెస్ పాలనలో పోలీస్ పాలన సాగుతుందని విమర్శించారు.
Here's Video:
" పోలీస్ రాజ్యంగా కాంగ్రెస్ పాలన "
" నియోజకవర్గం కు వెళుతుంటే అడ్డుకుంటారా "
- పొద్దున లేచి మా నియోజకవర్గంకు వెళుతుంటే..సమయానికి పోలీసులు వొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి.
- బుధవారం ఉదయం కొండాపూర్ లోని నివాసం నుండి నియోజకవర్గం కు బయలు దేరుతున్న నన్ను లోకల్ పోలీసులు… pic.twitter.com/a1vjht6kBJ
— Kotha Prabhakar Reddy (@KPRTRS) October 9, 2024