![](https://test1.latestly.com/wp-content/uploads/2023/11/Crime-1.jpg?width=380&height=214)
Kurnool, Feb 9: కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో ఘోరం జరిగింది. అప్పటి వరకు స్నేహితుల (Friends)తో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు (Youth) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కోసిగిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వీరేశ్ అనే యువకుడు కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో తన బంధువుల పెళ్లికి కుటుంబసభ్యులతో వెళ్లాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు సమయంలో వీరేశ్ డీజే పాటలకు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు.
అలా ఆసుపత్రికి..
ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తున్న వీరేశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఆందోళన చెందారు. వీరేశ్ మాట్లాడలేకపోవడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే యువకుడు మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరేశ్ ను డాక్టర్లు పరీక్షించి గుండె పోటుతో మరణించినట్లు నిర్దారించారు. అందరితో కలిసి హుషారుగా ఉండే వ్యక్తి ఇలా అకాలమరణం చెందడంతో వీరేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది.