Telangana Vikarabad Collector Prateek Jain Reacts Over Attack On Him(video grab)

Vikarabad, Nov 17: వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ (Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది. ప్రతీక్ జైన్ పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా  ఈ దాడి కేసులో రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్ అనే మరో నలుగురు అరెస్టు అయ్యారు. ఇప్పటి వరకూ 25 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మరికొంత మంది అరెస్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

పరారీలో ప్రధాన నిందితుడు

ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు  సురేశ్ ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. సురేష్ ను హైదరాబాద్ లో దాచిపెట్టి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీకు సంబంధించిన మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మ‌ణిపూర్ సీఎం నివాసంపై దాడి, మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సుర‌క్షితం