Telangana: భూములు విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు, పెంచిన ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి, తాజా ఉత్తర్వులతో ఏమేం పెరగనున్నాయో ఓ సారి చూద్దామా..
Image used for representational purpose. | Photo Wikimedia Commons

Hyderabad, July 20: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు పెంచుతూ (Land market value, stamp duty rates revised in Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భూముల విలువ (Land market value) మరింత పెరగనుంది. ఈ మేరకు భూముల విలువను 50 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నుంచి 7.5శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంపుదల జరిగింది.

వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. స్లాబుల వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలను పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ.100 నుంచి రూ.200లకు పెంచిన ప్రభుత్వం.. స్లాబులు వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ విలువలను పెంచినట్లు స్పష్టం చేసింది. ఆలాగే అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచింన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అవినీతి ఆరోపణలు, స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి

ఇప్పటికే స్లాట్లు బుక్‌ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.పెంచిన మార్కెట్‌ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ను సీఎస్‌ ఆదేశించారు.

తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ, రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు తెలిపిన సీఎం కేసీఆర్, బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు (stamp duty rates revised), రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

తాజా ఉత్తర్వులతో ఏమేం పెరగనున్నాయంటే..

భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై పెరగనున్నవి.

భూముల విలువ

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

విక్రయ అగ్రిమెంట్‌/జీపీఏ

డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ

డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌

కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు

బహుమతి(గిఫ్ట్‌)

టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌

జీపీఏ (ఆథరైజేషన్‌తో, ఆథరైజేషన్‌ లేకుండా)

వీలునామా

లీజు సహా ఇతర సేవల ఛార్జీలు