COVID-19 lockdown in India | (Photo Credits: IANS)

Hyderabad, June 3: ఇతర రాష్ట్రాలవారు తెలంగాణకు వచ్చేందుకు ఎలాంటి అనుమతి అవసరంలేదని (No Special Passes) శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని నగర పోలీసులు తెలిపారు. వలస కార్మికులు ఎందుకు నడిచి వెళుతున్నారు, వెంటనే శ్రామిక్‌ రైళ్లలో పంపేందుకు రైల్వే శాఖతో సంప్రదింపులు జరపండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

అయితే తెలంగాణ రాష్ట్రం (Telangana) నుంచి ఆంద్ర ప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏపీకి వెళ్లాలనుకునేవారు ఏపీ పోలీస్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ స్పందన, కర్ణాటక వెళ్లాలనుకునేవారు సేవాసింధు పోర్టల్‌, మహారాష్ట్రవారు మహారాష్ట్ర పోలీస్‌ పోర్టల్‌నుంచి అనుమతులు పొందవచ్చని తెలిపారు.  తెలంగాణలో కొత్తగా మరో 99 పాజిటివ్ కేసులు, మరో 4 కరోనా మరణాలు నమోదు, రాష్ట్రంలో 2891కు చేరువైన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, 92కి పెరిగిన మరణాలు

ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. కాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Lockdown 5.0) ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది. తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు.