COVID19 in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ మరో పది రోజులు పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 1897 కోవిడ్ కేసులు నమోదు, మరో 2982 మంది రికవరీ
తెలంగాణలో లాక్ డౌన్ జూన్ 19 వరకు మరో పది రోజులు పొడగిస్తూ రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఊహించినట్లుగానే ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపునిచ్చారు....
Hyderabad, June 8: తెలంగాణలో లాక్ డౌన్ జూన్ 19 వరకు మరో పది రోజులు పొడగిస్తూ రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఊహించినట్లుగానే ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపునిచ్చారు. అలాగే మరో గంట ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కఠిన లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ సడలింపులు జూన్ 10 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే కేసులు ఎక్కువగా వస్తున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో యధాతస్థితినే కొనసాగించాలని భావిస్తున్నారు. పూర్తి వివరాలు, లాక్డౌన్ తాజా మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.
రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి, కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూపోతుంది. దీంతో ఆక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,32,996 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1933 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1356 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,95,00కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 182 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 163, నల్గొండ నుంచి 151 మరియు రంగారెడ్డి నుంచి 114 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 15 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,409కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 2,982 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,67,285 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,306 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jun 08, 2021 08:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

