Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు, మోదీ ఇచ్చింది ఇవేనంటూ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

Hyd, April 30: భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక్క ఓటు వేసినా అది వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు.

వరంగల్‌ పట్టణానికి ఔటర్ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు.  ఫేక్ వీడియోల వెనుక రేవంత్ రెడ్డి, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ,ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం

హామీల గురించి అడిగితే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే బీజేపీ 400 సీట్లు కావాలని అంటోంది. అమిత్‌ షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించారు. నన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. గుజరాత్‌ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. ఢీల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను. గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు’’ అని రేవంత్ ఆరోపించారు.

Here's Congress Tweets

రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షింతలు ఇస్తామని.. కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. తమకంటే గొప్ప హిందువులు ఉన్నారా అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులాగా వాడుకోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  మోడీ, అమిత్‌ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి

ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కరీంనగర్ అండగా నిలబడ్డిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం..ఫైనల్లో గుజరాత్ గులాములను ఓడిస్తామని చెప్పారు. మోదీ తెలంగాణకు ఇచ్చింది ఏం లేదని.. బండి సంజయ్ రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదన్నారు. తెలంగాణను మోదీ అవమానిస్తుంటే..బండి సైలెంట్‌గా ఉన్నారని ధ్వజమెత్తారు. గుండు, అరగుండును గెలిపిస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

నన్ను అరెస్టు చేసిన కేసీఆర్‌ను ఓ మూలకు పండబెట్టా. కారును తూకం వేయాల్సిందే. కారు షెడ్డుకు పోయింది.. అందుకే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుండు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు బలహీన అభ్యర్థులను పెట్టుకున్నారు. మోదీ మా ప్రశ్నకు సమాధానం చెప్పు. రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయం. బీజేపీ ఓడిపోతేనే..ప్రజలు గెలుస్తారు. బలహీన వర్గాల మీద మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.