Death-Rep Image)

Hyd, Feb 24: మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వస్తుండగా వారికి ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే సమయంలో అటుగా వస్తున్న టిప్పర్‌ను కారు బలంగా ఢొట్టింది.

వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం, కుంభమేళాకు వెళ్తూ ఐదుగురు భక్తులు మృతి, మరో 7 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి (45), ఆయన భార్య విలాసిని (40), కారు డ్రైవర్ మల్లారెడ్డి ఉన్నారు. వెంకట్రామి రెడ్డి న్యాల్కల్ మండలం మామిడిగికి చెందినవాడు కాగా, డ్రైవర్ మల్లారెడ్డి మల్గి నివాసి. మృతదేహాలను సంగారెడ్డి జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి .