Hyderabad Metro Rail (photo-Video Grab)

ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్‌, రాయదుర్గం, మియాపూర్‌, ఎల్బీనగర్‌ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్‌ లో 15 నిమిషాలుగా మెట్రో ట్రైన్‌ నిలిపివేశారు అధికారులు. సాంకేతిక కారణాలవల్ల ఇబ్బంది కలిగినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

శిల్పారామంలో విరిగిన జాయింట్ వీల్, 20 అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డ్డ ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక‌రు మృతి, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలు

ఇవాళ ఉదయం నుంచి యథావిధిగా నడిచిన రైళ్లు ఉదయం 10 గంటల నుంచి సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం ఏర్పడిందని త్వరలోనే యదావిధిగా మెట్రో రైళ్లు ప్రయాణం జరుగుతుందని మెట్రో యాజమాన్యం విరించారు. అయితే లోపానికి గల కారణం ఏమి అనేది ఇంకా తెలియరాలేదు. పలు మెట్రో రైళ్లు పట్టాలపైనే నిలిపివేయడంతో ఉద్యోగస్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Metro trains stopped in Hyderabad due to technical issues

త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోట్రో స్టేషన్లకు ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో మెట్రో స్టేషన్ రద్దీగా మారింది. కొందరిని లోపలికి అనుమతి లేదని, మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. సుమారు అరగంట గడుస్తున్నా మెట్రో రైళ్లు కదలకపోవడం తీవ్ర ఇబ్బందిని గురిచేస్తుందని ప్రయాణికులు మండిపడుతున్నారు. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.