Hyd, Sep 29: హైడ్రాకు మూసీకి సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు. హైడ్రాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు...గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందన్నారు.
మూసీ నది సంరక్షణ కోసమే ఆపరేషన్ మూసీ చేపట్టాం అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు...బాధితులు ఒప్పుకుంటే డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించి ఖాళీ చేపిస్తున్నాం అన్నారు.
Here's Video:
కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం : మంత్రి పొన్నం
హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుంది.
హైడ్రాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు.
గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది.
మూసీ నది సంరక్షణ కోసమే ఆపరేషన్ మూసీ చేపట్టాం.
మూసీ… pic.twitter.com/cUm99MvXwp
— BIG TV Breaking News (@bigtvtelugu) September 29, 2024
కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. మల్లన్నసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులపై గత ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసినట్లు మేము చేయడం లేదు అన్నారు. అధికారం లేదని ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు అని దుయ్యబట్టారు.