Minister Uttam Kumar Reddy on SLBC Tunnel Incident(X)

Hyd, Feb 22:  తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కెనాల్ టెన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. 14వ కిలో మీటరు దగ్గర మూడు మీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయింది. వెంటనే సహాయక చర్యలను చేపట్టారు( SLBC Tunnel Collapse). ముగ్గురు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు.

SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). యూపీ, జార్ఖండ్‌కు చెందిన వాళ్లు చిక్కుకున్నారు.. వారిని సురక్షితంగా బయటకు తెస్తాం అన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని కోరామని వెల్లడించారు.

ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

సైన్యం, నేషనల్ డిజాస్టర్ టీమ్, ఉత్తరాఖండ్ లో ఈ తరహా ఘటన చోటు చేసుకున్నప్పుడు పాల్గొన్న రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దించుతున్నాం అన్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిలో ప్రాజెక్టు ఇంజనీర్, సైట్ ఇంజనీర్ తో పాటు మరో ఆరుగురు ఉన్నారు అన్నారు. ఈ ఘటన దురదృష్టకరం అన్నారు ఉత్తమ్.

Minister Uttam Kumar Reddy on SLBC Tunnel Incident

ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పనులను తిరిగి ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితమే ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉదయం టన్నెల్ పైకప్పు కూలింది.

టన్నెల్ లో పైకప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Minister Uttam Kumar Reddy on SLBC Tunnel Incident