MLA Sanjay Kumar Treated Treatment to Positive Patient in Jagtial (Photo-Twitter)

Hyderabad, August 17: ప్రమాదవశాత్తు గాయపడిన కరోనా రోగి బాధను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే మళ్లీ డాక్టర్ కోటును (Jagtial MLA Dr Sanjay Kumar) ధరించారు. ఏ మాత్రం ఆలోచించకుండా కరోనా రోగికి వైద్యం అందించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (MLA Sanjay Kumar) చొరవ తీసుకొని కరోనా పేషెంట్ కి వైద్యం అందించారు. వివరాల్లోకెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని అంతర్గాం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు ఇటీవల ఇంట్లో జారిపడ్డాడు. తలకు బలమైన గాయంతోపాటు కుడికాలు విరిగింది. కన్నుకు కూడా తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కరీంనగర్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన క్రమంలో అతను కరోనా బారిన పడ్డాడు.

కరోనా పాజిటివ్‌గా(COVID-positive) తేలడంతో అక్కడి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ తీవ్రమైన నొప్పితో నరకయాతన అనుభవిస్తున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ వెంటనే స్పందించారు. నేత్రవైద్యుడు అయిన ఎమ్మెల్యే సంజయ్‌తోపాటు ఆర్ధోపెడిక్‌ వైద్యుడు నవీన్, వైద్యసిబ్బంది పీపీఈ సూట్‌లు ధరించి కరోనా బాధితుడికి ఆదివారం చికిత్స అందించారు.

Here's Minister KTR Tweet

చికిత్స ద్వారా శంకర్ గౌడ్ కాస్త ఉమశమనం పొందాడు. కరోనాతో పోరాడుతున్నప్పటికి ఎలాంటి తీవ్ర లక్షణాలేవి లేవని ఎమ్మెల్యే తెలిపారు. శంకర్ గౌడ్‌కు తలకు గాయం, కాలు విరగటంతో నొప్పి భరించలేక నరకయాతన అనుభవిస్తున్నందున ఉపశమనం కోసం తక్షణ వైద్యాన్ని అందించామని ఆయన చెప్పారు. తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, రాష్ట్రంలో 92 వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 703కు చేరిన మృతుల సంఖ్య

కరోనా నెగెటివ్ వచ్చిన అనంతరం పూర్తి స్దాయిలో శస్త్ర చికిత్స అందిస్తామని కుటుంబభ్యులకు సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు.ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించగా.. మంత్రి కేటీఆర్ సంజయ్‌పై ప్రశంసలు (KTR Appreciated MLA) కురిపించారు.