TRS MLAs Poaching Case (Photo-Video Grab)

Hyd, Dec 19: తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల ఎర కేసులో (MLAs Poaching Case) విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి (MLA Rohit Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్‌ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

2015 నుంచి రోహిత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్‌మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ.. దాని నమూనాను నోటీసులతో జత చేసింది.

మూడు వారాల తర్వాత తొలిసారి బయటకు వస్తున్న ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రక్షణ కోసమే ప్రగతి భవన్‌లో ఉన్నామన్న శాసనసభ్యులు.. ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరుకావడంపై..ఈ నెల 25 వరకు గడువు కావాలని ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ (MLA Rohit Reddy letter to ED) రాశారు. విచారణ షెడ్యూల్‌ మార్చాలని కోరారు. అయితే ఈడీ ఎంత సమయం ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని రోహిత్‌ రెడ్డి అంటున్నారు. వరుస సెలవులు కారణంగా బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్‌ రెడ్డి చెబుతున్నారు.