MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు,సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే
TRS MLAs Poaching Case (Photo-Video Grab)

Hyd, Feb 7: తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై (MLAs Poaching Cas) తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించగా.. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు (Telangana govt moves to supreme court) చేసింది.

పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే కోరారు. కేసును సీబీఐకు ఇస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. రేపు(బుధవారం) మెన్షన్‌ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందన్నారు.

ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌లో మంగళవారం విచారణ జరిగింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు.కేసు ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

సీబీఐ చేతికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు, సీబీఐ విచారణకు సహకరిస్తామని తెలిపిన ఎమ్మెల్యే బాలరాజు

పిటిషన్‌ విచారణకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ నుంచి అనుమతి తీసుకొని రావాలని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. దీంతో రేపు ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్‌ చేస్తామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని సింగిల్‌ బెంచ్‌ ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ (Telangana High Court) గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది.

తెలంగాణ బడ్జెట్ పూర్తి కేటాయింపుల వివరాలు ఇవిగో, వ్యవసాయానికి రూ.26,831 కోట్లు, నీటి పారుద‌ల రంగానికి రూ. 26,885 కోట్లు, హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసింది. ఆపై సిట్‌ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్‌ అభ్యర్థనను డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. దాంతో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్‌.తాజాగా ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చూస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.