MLC Kavitha CM Revanth Reddy on BRS Leaders Arrest(X)

Hyd, Nov 27:  బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత...చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు.

ప్రజా పాలను అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బందిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయన్నారు.  కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారుపై దాడి, ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై రాళ్ల దాడి...పోలీసులకు ఫిర్యాదు, వీడియో ఇదిగో 

Here's Video:

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా అని..తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం అని దుయ్యబట్టారు.