MLC Kavitha performed the Bhoomi Pooja for 22-foot statue of Telangana Thalli at Jagtial(X)

Jagtial, Dec 15:  తెలంగాణ ప్రభుత్వ జీవో లెక్క చేయకుండా జగిత్యాలలో బతుకమ్మతో ఉండే 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయాడు...కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం అన్నారు.

జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో ఏం అభివృద్ధి జరగలేదు అని మండిపడ్డారు కవిత. పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు.. పైసల కోసం పార్టీ మారినవాడు నాయకులు కారు అన్నారు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు, మనకు ఎమ్మెల్యేలు అవసరం లేదు...

కేసీఆర్ సైనికులుగా మీరు ఉన్నారు మన ప్రభుత్వం వస్తుందన్నారు.  కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

Here's Video:

కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదు అన్నారు కవిత. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటాం...గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టిన భయపడేది లేదు అన్నారు. మా అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం...

తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటాం అని తేల్చిచెప్పారు. తెలంగాణ అస్తిత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతాం అని తేల్చిచెప్పారు కవిత.

Here's Video: