TPCC Chief Mahesh Kumar Goud open letter to KCR(X)

Hyd, Dec 15:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్.. తన పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ తో అధికారం చేపట్టి గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగుల్చారు...సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై పాలన సాగించారు అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు.  98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

మీ పెత్తందారు సర్కార్ తో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడారు...కానీ మీలో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు..ఇదే పంథా కొనసాగితే తగిన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని హెచ్చరించారు.