PM Modi (Phot-ANI)

Hyderabad, April 8: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు? అభివృద్ధి ముచ్చట్లకే పరిమితమవుతారా? రాజకీయ విమర్శలు ఎక్కుపెడతారా? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

Good News For Malls: రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ .. ఉద్యోగులు షిఫ్ట్‌కు మించి పనిచేస్తే అదనపు వేతనం.. రోజంతా తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాలని జీవో

రూ.720 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ..

720కోట్ల రూపాయలతో కేంద్రం చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు ఇవాళ ప్రధాని .. శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణాలకూ.. పరేడ్‌గ్రౌండ్ నుంచే శంకుస్థాపన చేయనున్నారు. వాటి నమూనాలను కూడా అక్కడే పరిశీలిస్తారు.అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి హైదరాబాద్ –తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తారు మోదీ. 13 ఎంఎంటీఎస్ రైలు సేవలను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని… దాదాపుగా 2గంటల పాటు హైదరాబాద్‌లో గడపనున్నారు.

Vande Bharat Train Charges: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ట్రైన్లో చార్జీలు ఎంతో తెలుసా? వివరాలు విడుదల చేసిన రైల్వే

షెడ్యూల్ ఇది..

  • శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
  • ఉదయం 11.45 నుంచి 12 గంటల 5 నిమిషాల మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ కోసం శంకుస్థాపన.
  • ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి ఒంటి గంట 20 నిమిషాల మధ్య పరేడ్ గ్రౌండ్ లో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు మోదీ. అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.