Khammam, Jan 24: భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లితండ్రులను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న ఆమెకు భర్త తీరు మనసు విరిగి కఠిన నిర్ణయం తీసుకుంది భార్య.
ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నపుడు అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు.ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు
దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది.. అయినా అతడిలో మార్పు రాలేదు. అయితే ఓ దొంగతనం కేసులో భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో.. అవమానంతో ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు బంధువులు.