Moving car catches fire in Hyderabad Tankbund (Photo-Video Grab)

Hyderabad: ట్యాంక్ బండ్ సమీపంలో బోట్స్ క్లబ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళుతున్న ఒక కారులో అకస్మాత్తుగా మంటలు (car catches fire in Hyd) చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు, పాదచారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు వెనక ప్రయాణిస్తున్న వారు దానిలో నుంచి మంటలు (Moving car catches fire in Hyderabad) రావడం గమనించి.. కారులో ప్రయాణిస్తున్న వారికి ఈ విషయం చెప్పారు. దాంతో వారు కారును ఆపి వెంటనే కిందకి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే ఆర్‌పీ రోడ్‌లో నివాసముండే టి విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి. శుక్రవారం మధ్యాహ్నం విజయ్ కుమార్ అతని భార్యతో కలిసి ఓపెల్ కోర్స కారు నెంబర్ ఏపీ 10 క్యు 2888లో సచివాలయం సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్తుండగా హోటల్ మారియట్ దాటి సెయిలింగ్ క్లబ్ వద్దకు రాగానే కారు వెనక నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతడి కారు వెనక ప్రయాణం చేస్తున్న వారు దీని గురించి విజయ్‌ కుమార్‌కు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన విజయ్ కుమార్, అతడి భార్య వెంటనే కారు దిగి పోయారు.

తెలంగాణలో మగవారికే ఎక్కువగా కరోనా వ్యాప్తి, సంచలన విషయాలు వెలుగులోకి, మొత్తం 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు కరోనా బారీన పడ్డారని వెల్లడించిన తెలంగాణ ఆరోగ్య శాఖ

ఈ ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో జరిగింది. ఈ సరిహద్దు తమది కాదంటే తమది కాదంటూ పోలీసులు చెప్పడంతో షాక్‌కు గురైన విజయ్ కుమార్ చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది. కారు మంటల్లో కాలిపోతుందని ఫోన్ చేసినా ఫైర్ సిబ్బంది ఎవరూ స్పందించలేదని కారు యజమాని ఆరోపించారు. దీంతో కారు యజమాని ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయినట్లు సమాచారం.