Election Commission of India. File Image. (Photo Credits: PTI)

Munugode, Oct 28: తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావును (RO KMV Jagannadha Rao ) తక్ష ణమే సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్‌ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రిటర్నింగ్‌ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్‌ గుర్తును మార్చి బేబీ వాకర్‌ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆ స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను ఆర్వోగా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్‌ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్ల డీల్ కేసు అప్‌డేట్స్ , విచారణను వేగవంతం చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అంటూ బీజేపీ విమర్శలు, ధర్నాకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మునుగోడు ఉపఎన్నికను (Munugode Bypoll 2022) రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్‌రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్‌ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులై పారిందని, టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు.