Hyd, Nov 4: మునుగోడులో పోలింగ్ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,41,805 కాగా.. 5 గంటల సమయానికి 1,87,527 ఓట్లు పోలయ్యాయి.
గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. ప్రచారం పర్వంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి అభ్యర్థులుగా బరిలో నిలిచారు.