nadendla Manohar slams Jagan on Kakinada port issue(X)

Hyd, Dec 1:  కాకినాడ పోర్ట్ ను తన చేతుల్లోకి లాక్కోడానికి జగన్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల... కేవీ రావు కుటుంబాన్ని జగన్ ఎందుకు హింసించాడు? చెప్పాలన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా 41% షేర్లను అరబిందోకి కట్టబెట్టారు...దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.

ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో కుట్ర చేసి దోచుకు తింటుంటే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కాకినాడకు రావాల్సి ఉంటుందన్నారు. ఇదేమి ఒక వ్యక్తిపై కక్ష కట్టినట్టు కాదు... గత పాలనలో ముఖ్యమంత్రి అయిన జగన్‌ కి తెలియకుండా జరగదు కదా ఈ దోపిడీ ? అన్నారు. అరబిందో రియాల్టీ కి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది ? , ఏ సందర్భంలో చేసింది ?, భారతదేశం లో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావుని, వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించుకున్నారో కచ్చితంగా బైటకు రావాలన్నారు.

మెడ మీద కత్తి పెట్టి ఎప్పుడైతే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ నుండి లాగేసుకుని వీళ్ళు అరబిందో కి అప్పజెప్పారో ఆరోజు నుండి లెక్కలు చూస్తే ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. రాష్ట్రంలో ఈ బియ్యం సరఫరా చెయ్యడానికి 29,000 రేషన్ షాపులు ఉండగా జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత డోర్ డెలివరీ చేస్తామనే అబద్ధపు ప్రచరంతోటి రాష్ట్ర ఖజానాకు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో 9260 వాన్లు కొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ తయారు చేశారు అన్నారు.

రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పొద్దున నుండి సాయంత్రం వరకు వినియోగదారులు ఎప్పుడు వచ్చినా సరుకు అందించే ఒక మంచి ప్రక్రియని పక్కదారి పట్టించి స్వలాభం కోసం ఈ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు అన్నారు. ఎందుకు కాకినాడ పోర్ట్ పైన మనం దృష్టి సారించడం అనేది అందరూ తెలుసుకోవాలి..గత 5 సంవత్సరాల్లో ఎవ్వరినీ పోర్టు లోపలికి అనుమతించలేదు అన్నారు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, అధికారులు ఎవరున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలుసుకోడానికి మీడియా వారిని కూడా అనుమతించలేదు అన్నారు.   డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ..4వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 3వ తేదీకి మార్పు 

కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు ఇస్తే దాదాపు 6,300 కోట్ల రూపాయల బియ్యం లెక్కలు చూపించి ఇక్కడ నుండి తరలించేశారు అన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతి అయిన బియ్యం..గంగవరం పోర్టు నుండి - 2,20,289 మెట్రిక్ టన్నులు.

కృష్ణపట్నం పోర్టు నుండి - 23,51,218 మెట్రిక్ టన్నులు...విశాఖపట్నం పోర్టు నుండి - 38,02,000 మెట్రిక్ టన్నులు..కాకినాడ లెక్కలు చెప్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు...ఒక్క కాకినాడలో జరిగిన దీని విలువ 48,537 కోట్ల రూపాయలు అన్నారు.