Narcotic Enforcement Wing DCP Chakravarthy Gummi (Photo-Video Grab)

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్‌ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్‌ ఉపాధ్యాయకు హష్‌ ఆయిల్‌ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతిని హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్‌ టీమ్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి (Narcotic Enforcement Wing DCP Chakravarthy Gummi) మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ పెడ్లర్స్‌ అందరినీ అరెస్ట్‌ చేశాం. కొందరు కస్టమర్లను పట్టుకోవాల్సి ఉంది. లక్ష్మీపతి మొదట డ్రగ్స్‌ (Hyderabad Drug Case) వినియోగదారుడు, ఆ తర్వాత పెడ్లర్‌గా మారాడు. ఇతడిపై ఇప్పటివరకు ఆరు కేసులు ఉన్నట్లు డీసీపీ చక్రవర్తి తెలిపారు. 2016లో రెండు కేసుల్లో అరెస్ట్‌ అయ్యాడు.

లక్ష్మీపతి విద్యార్థిగా ఉన్నప్పుడే డ్రగ్స్‌కు (Hyderabad Drugs Case) బానిసయ్యాడు. ఇతడికి డ్రగ్స్‌ పెడ్లర్లతో కనెక్షన్లు ఉన్నాయి. ఈ కేసులో పరారీలో ఉన్న 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నాం. 5 గ్రాముల హాష్‌ ఆయిల్‌ బాటిల్‌ సుమారు రూ.3వేలు ఉంటుంది. హాష్‌ ఆయిల్‌ మత్తు 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. గంజాయి కంటే హాష్‌ ఆయిల్‌ ఎక్కువ మత్తు కలిగిస్తుందని నార్కోటిక్స్‌ టీమ్‌ డీసీపీ చక్రవర్తి మీడియాకు వెల్లడించారు.

మత్తుమందు ఇచ్చి అవయవాలు ఎత్తుకెళ్లారు! గోవాలో మిస్సైన టెంపో డ్రైవర్ తలపై మిస్టరీ కుట్లు, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, కళ్లు తెరిస్తే కానీ మీస్టరీ వీడే అవకాశం లేదు

కాగా, గత వారం ప్రేమ్‌ ఉపాధ్యాయ అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లక్ష్మీపతి కోసం హెచ్‌–న్యూ ముమ్మరంగా గాలించింది. మంగళవారం ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి హాష్‌ ఆయిల్‌ సరఫరా చేస్తున్న అరకు మండలం లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్‌ కోసం గాలిస్తున్నారు. లక్ష్మీపతి ఓ కేసులో 2020 నవంబర్‌ 27న మల్కాజ్‌గిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ చిక్కాడు.