Meerpet Woman Murder Case Update Husband killed Wife Influenced by Web Series(X)

Hyderabad, Feb 9: తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసిన మీర్‌ పేట్ హత్యకేసులో (Meerpet Murder Case Update) మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. భార్య మాధవిని హత్య చేయడానికి గురుమూర్తికి మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం . గురుమూర్తికి సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడం తెలిసిందే.

ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే?

అసలేం జరిగింది?

సంచలనం సృష్టించిన మీర్ ​పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి భార్య వెంకట మాధవిని హత్య చేసిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సీపీ అన్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలో నివ్వెరపోయామన్నారు. క్షణికావేశంలో చేసిన హత్య కాదని పథకం ప్రకారమే హత్య చేశాడని అన్నారు. గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని ఆయన వివరించారు.

అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??