Hyderabad New CP Kothakota Srinivas Reddy (Photo-Video Grab)

Hyderabad Police Enforce Strict Guidelines for New Year Event:హైదరాబాద్‌ నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్‌ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు న్యూయర్‌ మార్గదర్శకాలను (Hyderabad Police Enforce Strict Guidelines) జారీ చేశారు.

తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పులు, చేర్పులు కూడా అప్పటి నుంచే..

హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఈవెంట్‌లో (New Year 2024) సెక్యూరిటీ తప్పనిసరి. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలి. మద్యం అనుమతించే ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. వేడుకల్లో డ్రగ్స్ వాడినా, వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పోలీసులు స్పష్టం చేశారు.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్‌ సమస్య కలిగించవద్దు. లిక్కర్‌ సంబంధిత ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూ ఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్‌ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సమయానికి మించి లిక్కర్‌ సరఫరా చేయవద్దని తెలిపారు. వేడుకలకు అనుమతించిన సమయం ముగిశాక లిక్కర్ సరఫరా చేస్తే చర్యలు తప్పవన్నారు.