Metro Train New Timings: ముఖ్య గమనిక..నైట్ 7.45కి చివరి మెట్రో ట్రైన్, రాత్రి 8.45 నిమిషాలకు చివరి స్టేషన్‌కు మెట్రో రైలు, నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైలు సమయాల్లో కీలక మార్పులు చేసిన అధికారులు
Hyderabad Metro Rail (Photo-wikimedia commons)

Hyderabad, April 20: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు (Metro Train New Timings) చేశారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్‌ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు (New timings for metro train) అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి మంగళవారం ప్రకటించారు.

లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి ఈ నెల 30 తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు మాస్కు, శానిటైజర్లు వాడాలని మెట్రో అధికారులు సూచించారు.

నో లాక్‌డౌన్, తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు, అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను నియంత్రించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ (Night Curfew In Telangana) విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్‌ నిర్వహణకు అనుమతినిచ్చింది.