Hyderabad, April 20: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది.
రాత్రి 8 గంటల వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, షాపులకు అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత ఎక్కడైనా షాపు ఓపెన్ చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
అత్యవసర విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా ఐడీ కార్డులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికుల వద్ద వ్యాలిడ్ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అంతర్ రాష్ర్ట సర్వీసులు, రాష్ర్ట సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
Here's ANI Update
Government of Telangana announces night curfew in the state from 9 PM to 5 AM. The order comes into effect immediately and will remain imposed till May 1st. Essential services to remain exempted. pic.twitter.com/0u4ePfcMo0
— ANI (@ANI) April 20, 2021
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,22,143 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 5,926 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 6,033 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,61,359కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 793 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యాయి.
COVID కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల్లో COVID కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక మేడ్చల్ నుంచి 488 కేసులు, రంగారెడ్డి నుంచి 455, నిజామాబాద్ నుంచి 444 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
మినహాయింపులు
అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్‌లు, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారు. విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు వ్యాలిడ్ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. అంతరాష్ర్ట రవాణాకు ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిషేధం వీటిపైనే
పౌరులు బయట తిరగడం, థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హోటల్స్ రాత్రి 8 గంటల తర్వాత బంద్ కానున్నాయి.