Hyderabad, Dec 27: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతికి తెలంగాణ ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. సెలవు విషయం తెలియని చాలా మంది రోగులు పంజాగుట్టలోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు ఓపీ సేవలను నిలిపివేయడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి
Title: NIMS suspends OP services following Manmohan Singh’s demise
Link: https://t.co/pU1hSBwXBy
— THARANI VENDAN S (@THARANIVENDANS1) December 27, 2024
రోగుల విజ్ఞప్తి ఇదే
వైద్య సేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు.