Nizamabad Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, టైర్ పేలడంతో గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు
Road accident (image use for representational)

Nizamabad, August 10: నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Nizamabad Road Accident) జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్‌ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.టైర్ పేలడంతో కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి పల్టీలుకొడుతూ డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు (Four persons killed ) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులపై తెలంగాణ పోలీసులను అలర్ట్ చేసిన ఐబీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నారని, మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.