powerful rains expected at hyderabad, IMD issues yellow alert, heavy rainfall in hyderabad some areas

Hyd, Sep 4:  భాగ్యనగరం హైదరాబాద్‌ను మరోసారి వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్థరాత్రి నుండి తెల్లారే వరకు వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు.

ప్రధానంగా సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జీడిమెట్ల, కూకట్ పల్లి, ప్రగతి నగర్, బేగంటపేట, అమీర్ పేట, బంజారాహిల్స్, పంజాగుట్ట, సైదాబాద్, మలక్ పేట, కోఠి, అబిడ్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్,లింగంపల్లి, పటాన్ చెరు, చందానగర్. కొండాపూర్, గచ్చిబౌలి, మల్కాజ్ గిరి, చర్లపల్లితో పాటు నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఇంకా వర్షం పడుతుండగా ప్రజల బాధ వర్ణణాతీతం.

నిజాంపేటలో కొన్ని అపార్టుమెంట్లు జలమయం అయ్యాయి. సెల్లార్‌లోకి నీరు చేరడంతో మోటార్లసాయంతో బయటకు తోడగా అధికారులు తమను పట్టించుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోడ్లన్ని చెరువులను తలపించగా భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. తాను ఫామ్‌ హౌస్‌లో పడుకున్నోడిలా కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని వెల్లడి 

Here's Tweet:

ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించడంతో మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది.

Here's Video: