Prabhas Fined: ప్రభాస్‌కు పోలీసుల షాక్, రోడ్డుపై కారు ఆపి ఫైన్ వేసిన పోలీసులు, బ్లాక్ ఫిల్మ్ తొలగింపు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేనందుకు చలాన్
Prabhas.

Hyderabad, April 16: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు (Traffic police) కార్ విండోలకి బ్లాక్ ఫిలింలు (Black Films) తీసెయ్యాలి అంటూ వచ్చిన ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింలను తొలగిస్తున్నారు పోలీసులు. సాధారణంగా సెలబ్రిటీలంతా తమ కార్లకి కచ్చితంగా బ్లాక్ ఫిలింలు అమరుస్తారు. మన దగ్గర చాలా మంది సెలబ్రిటీలు (Celebrities)తమ కార్లకి ఈ బ్లాక్ ఫిలింలు వాడతారు. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు పట్టుబడుతున్నారు.

Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్, రేపటి నుంచి 24 గంటల పాటు వైన్ షాపులు బంద్, హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తు నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు

ఇప్పటికే ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్ (Allu Arjun), కళ్యాణ్ రామ్(Kalyan Ram), మంచు మనోజ్, త్రివిక్రమ్, నాగ చైతన్య.. లాంటి పలువురి కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిలింలని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.

AP CM Jagan As Chief Guest For Acharya Pre Release Event : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్, ఆహ్వానించనున్న మెగాస్టార్ చిరంజీవి

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కారుకు చలాన్ విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ప్రభాస్ కి సంబంధించిన కార్ కి (Challan to Prabhas ) ఎంపీ స్టిక్కర్ ఉన్న నంబర్ ప్లేట్, విండోలకి బ్లాక్ ఫిలింస్ ఉండటంతో 1450 రూపాయలు జరిమానా విధించారు పోలీసులు. అయితే ఈ సమయంలో కార్ లో ప్రభాస్ లేరని తెలిపారు పోలీసులు.