Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్, రేపటి నుంచి 24 గంటల పాటు వైన్ షాపులు బంద్, హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తు నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు
Chhattisgarh launches portal for home delivery of liquor to avoid crowding during lockdown (Photo-ANI)

Hyderabad, April 15: వీకెండ్‌లో మద్యంతో ఎంజాయ్ చేద్దామనుకునే మందు బాబులకు బ్యాడ్ న్యూస్. రేపు అనగా ఏప్రిల్ 16న శనివారం హైదరాబాదులోని మద్యం దుకాణాలు (Wine shops to closed) మూసివేయబడతాయి.నగర పరిధిలోని అన్ని మద్యం దుకాణాలతో పాటు, బార్ అండ్ రెస్టారెంటులు, కల్లు దుకాణాలను మూసేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.కేవలం స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులోని బార్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం ఆరుగంటల నుంచి ఆదివారం ఉదయం ఆరుగంటల వరకు వైన్ షాపులు మూతపడతాయని నగర కమిషనర్ తెలిపారు. 24 గంటల పాటు మందుబాబులు సహకరించాలని కోరారు. రాముడి అసలు దేవుడే కాదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్‌ మాజీ సీఎం జితిన్‌ రాం మాంఝీ, తుల‌సీదాస్‌, వాల్మీకి తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్య‌లు

హనుమాన్ జయంతి (Hanuman Jayanthi ) సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆదేశాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రేపు భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగనుంది. గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్ బంద్ హనుమాన్ దేవాలయం వరకు సాగే శోభాయాత్రకు 8 వేల మంది పోలీసులతో బందొబస్త్ ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.