Rachakonda CP mahesh bhagwat (Photo-Twitter)

Hyderabad, Feb 13: ఘట్ కేసర్ వద్ద నాపై అత్యాచారం చేశారంటూ బీఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిపై అత్యాచారం జరగలేదని (Ghatkesar Kidnap Case) అది కేవలం అంతా కట్టకథని పోలీసులు తేల్సి పడేశారు. ఈ విషయాలను రాజకొండి సీపీ మహేష్ భగవత్ (Rachakonda CP mahesh bhagwat) మీడియాకు వెల్లడించారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదని అదంతా కట్టుకథని ఆయన అన్నారు.

యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని, పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని యువతి చెప్పిందని, ఆమెకు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఎప్పటి నుంచో ఉందని, 6 నెలల క్రితం తన ఫ్రెండ్‌కి ఇంకో కిడ్నాప్ కథ చెప్పిందని సీపీ వెల్లడించారు. అమ్మాయికి కిడ్నాప్‌లు అంటే ఇష్టమని తెలిపారు. ఆటో డ్రైవర్లకు క్షమాపణలు చెబుతున్నామని మహేష్‌ భగవత్‌ ప్రకటించారు.

తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా ట్రేస్‌ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డయన్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు.

వింత శబ్దాలతో భయపెట్టేవారికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్, వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు, మెకానిక్‌లపైనా చర్యలు తప్పవు

తనపై అ‍త్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కిడ్పాప్‌ లేదు, రేప్‌ లేదన్నారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్‌, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్‌ భగవత్‌ తేల్చిచెప్పారు.

ఘటన జరిగిన రోజు ఆమె తనకు తెలిసిన వ్యక్తితోనే బైక్‌పై వెళ్లినట్లు, అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆమె ఇలా తప్పుదోవ పట్టించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలపైన, సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ పైన దృష్టి సారించారు.

కాగా కండ్లకోయలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించిన ఇదంతా కట్టుకథగా తేలింది.