Rahul Gandhi (Credits: X)

Warangal, Feb 11: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మంగళవారం తెలంగాణకు (Telangana) రానున్నారు. నేడు సాయంత్రం ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం ఐదున్నర గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి చాపర్‌ లో వరంగల్‌ కు వెళ్లనున్నారు. సాయంత్రం సుప్రభ హోటల్‌ లో కొంత సేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ట్రైన్ లో స్టూడెంట్స్‌ తో ప్రొగ్రాంకు ఆయన వెళ్తారు. అనంతరం వరంగల్ నుంచి సాయంత్రం ఏడున్నర గంటలకు రైలులో రాహుల్ తమిళనాడు వెళ్లనున్నారు.

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు.. ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ.. మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు

అందుకేనా??

రాహుల్ గాంధీ వరంగల్ ఆకస్మిక పర్యటన వెనుక కారణాలు ఏమిటన్న దానిపై రాజకీయ విశ్లేషకులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమిటన్న దాన్ని స్వయంగా తెలుసుకోవడానికే రాహుల్ తెలంగాణకు వస్తున్నట్టు అనుమానిస్తున్నారు. కాగా,  రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!