Hyd, Nov 16: బఫర్ జోన్ లో ఇల్లు ఉందని సామాన్యుల ఇండ్లు కూలగొడతా అంటున్నావ్.. మరి పెద్ద కంపెనీలకు అదే భూమి ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టుకోమని అంటున్నావు ఇదెక్కడి న్యాయమో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...ఇంట్లకెళ్ళి ఏమో మురికి నీళ్లు ఒస్తది… మాల్ లో కెళ్ళి ఏమన్నా సుగంధం వస్తదా? చెప్పాలన్నారు కేటీఆర్.
రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరంతా గమనిస్తూనే ఉన్నారు... తెలంగాణ ఏర్పడిన మొదట్లో హైదరాబాద్‌కు పెట్టుబడులు రావని, హిందూ-ముస్లింల గొడవలు జరుగుతాయని ప్రచారం చేశారు అన్నారు. కానీ కేసీఆర్ గారు అభివృద్ధే కులం, సంక్షేమమే మతం అన్నట్లుగా అభివృద్ధి చేసి అవన్నీ ప్రచారాలే అనే విధంగా చేశారు అన్నారు. దేశంలో తెలంగాణను ఎన్నో రంగాల్లో రోల్ మోడల్‌గా నిలిపారు... వ్యవసాయం, విద్యుత్, పేదవాళ్లను ఆదుకోవటం, సంక్షేమం, ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్ చేశారు అన్నారు.
కరోనా లాంటి సమయంలో కూడా సంక్షేమం ఆపకుండా పేదలను కడుపులో పెట్టుకొని చూశారు... ఆయన చేసిన అభివృద్ధి కారణంగానే రాజేంద్రనగర్‌లో ప్రకాష్ గౌడ్‌ను ప్రజలు గెలిపించారు అన్నారు. పైరవీల కోసం అక్కడి ఎమ్మెల్యే పార్టీ మారినప్పటికీ మేము ఉన్నామని కార్యకర్తలు బలంగా నిలవటం చూస్తుంటే గర్వంగా ఉంది... కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. మనకు కూడా వచ్చాయి. కానీ వాటిని మనం గట్టిగా ఎదుర్కోవాలి అన్నారు. 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారు. 24 ఏళ్లలో ఇంతింతై వటుండింతే అన్నట్లుగా రాష్ట్రం నలుమూలలా బీఆర్ఎస్ బలంగా మారిందన్నారు.
కేసీఆర్ అంటే ఒక శక్తి. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అని రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు... గతంలోనూ ఎంతో మంది కేసీఆర్ ఫినిష్ చేస్తా అన్నారు. కానీ చరిత్ర తొంగి చూసుకో రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లు ఎక్కడ ఉన్నారో.. వాళ్లతోనే కాలేదు. నువ్వు ఎంత?, కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే.. రేవంత్ రెడ్డికి సీటు సీటు ఉంటుండేనా? చెప్పాలన్నారు. పదవులు ఉండటం కాదు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారికి ప్రత్యేక స్థానం ఉంది...రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరు అన్నారు. కేసీఆర్ రైతుబంధు రూ. 10 వేలు బిచ్చం వేసినట్లు వేస్తున్నాడు.. మేము రూ. 15 వేలు ఇస్తాం అని నువ్వే కదా అన్నావ్... వానాకాలం రైతు బంధు ఇప్పటికీ పడలేదు. దాన్ని ఎగ్గొట్టారు. రైతన్నలు ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు అన్నారు.
కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు చేస్తా అంటివి... సోనియమ్మ బర్త్‌డే నాడే చేస్తా అంటివి. ఒక ఏడాది అయిపోయింది. మళ్లీ సోనియమ్మా బర్త్‌డే వస్తోంది... ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వలేదు అన్నారు. సోనియా గాంధీని మాత్రమే కాదు. మొత్తం ప్రజలందరినీ మోసం చేశాడు... దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఒట్లు వేశాడు అన్నారు. దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి... పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీష్ రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది? అన్నారు. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో వెల్లడి
Here's Video:
బఫర్ జోన్ లో ఇల్లు ఉందని సామాన్యుల ఇండ్లు కూలగొడతా అంటున్నావ్..
మరి పెద్ద కంపెనీలకు అదే భూమి ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టుకోమని అంటున్నావు.
ఇంట్లకెళ్ళి ఏమో మురికి నీళ్లు ఒస్తది… మాల్ లో కెళ్ళి ఏమన్నా సుగంధం వస్తదా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/yZ82KZbEdP
— BRS Party (@BRSparty) November 16, 2024
ఒక్క హిందూ దేవుళ్లను మాత్రమే కాదు అన్ని మతాల దేవుళ్లను మోసం చేశాడు.. జిల్లాల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి కొంతమంది మోసపోయారు. కానీ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నైజం తెలుసు కాబట్టి వాళ్లకు ఓటు వేయలేదు అన్నారు. హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు... మనం గెలిపించిన వాళ్లు మనల్ని వదలిపోయారు. కానీ ఆయన పశ్చాత్తాపం చెందటం ఖాయం అన్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన సరే కార్యకర్తలే పార్టీ నడుపుతుండటం సంతోషాన్నిస్తోందన్నారు. ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజల కోసం పోరాడి వాళ్ల గుండెల్లో శాశ్వత స్థానం సంపాందిచుకోవచ్చు... మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నస్తున్నాడని మూసీ బాధిత ప్రాంతాల్లో పర్యటించాం అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మొత్తం మేము తిరిగితే.. ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు...మా కష్టంలో ఎవరు మాతో ఉన్నారో మాకు అర్థమైందని అన్నారు.