కొణిజేటి రోశయ్య, (file Photo)

Hyderabad December 05: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Rosaiah) అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ(AP) ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ(Bosta Sathyanarayana), వెల్లంపల్లి(Vellampally), పేర్నినాని(Perni Nani), బాలినేని(Balineni) హాజరయ్యారు. ఈ ఉదయం రోశయ్య(Rosaiah)  పార్థివదేహాన్ని అమీర్‌పేట(Ameerpet)లోని స్వగృహం నుంచి గాంధీభవన్‌(Gandhi Bhavan)కు తరలించారు. అక్కడ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

Konijeti Rosaiah Passed Away: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత, ముగిసిన శకం, సీఎం జగన్ సంతాపం..

ఏఐసీసీ తరుపున రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Khagre) రోశయయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగింది. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రలో వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోశయ్య పెద్ద కుమారుడు ఆయన చితికి నిప్పు అంటించారు.