Rs 200 Cr development works for CM Revanth Reddy native village Kondareddy Palle(X)

Hyd, Oct 11: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరులో అభివృద్ది పనులు జోరందుకున్నాయి. రూ.200 కోట్లతో ముస్తాబవుతోంది కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు.

సుమారు రూ.72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి ఎనుముల నరసింహారెడ్డి పేరు పెట్టారు. రూ.45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, రూ.70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, రూ.25 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, మోడ్రన్ బస్ షెల్టర్, పార్క్, ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అమానుషం..పద్మ శ్రీ మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు 

Here's Tweet:

సోలార్ విద్యత్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు.డెవలప్మెంట్ పనులను దసరా రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.