CM Revanth Reddy About Group 2 Exam#Twitter)

Hyd, August 14: 15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన (CM Revanth Reddy) మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రెండో రింగ్‌రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ద్వారా సెమీ అర్బన్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

సీఎం మాట్లాడుతూ..తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్‌ అని అన్నారు. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు (Rs.31,500 crore foreign investment), 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలుసు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం.  బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య

పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పమని తెలిపారు.

కాగ్నిజెంట్‌ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. హైదరాబాద్‌లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ

రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది’’ అని అన్నారు.

1992లో నేదురుపల్లి జనార్ధన్ రెడ్డి ఐటీ సెక్టార్ కోసం పునాదిరాయి వేశారని, ఆ తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోతే... చంద్రబాబు వచ్చాక హైటెక్ సిటీని నిర్మించారన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. చంద్రబాబు, వైఎస్‌లో సైబరాబాద్‌ను మూడో నగరంగా నిర్మించారన్నారు. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్... మూడు నగరాలు ఉన్నాయన్నారు.

కులీకుతుబ్ షా మొదలు చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో రాజీపడలేదన్నారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌పై ఆ ప్రభావం పడకుండా చూశారన్నారు. అలాంటి విధానాలు కొనసాగించాలని తాము భావిస్తున్నామన్నారు.

ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో తమ ప్రభుత్వం నాలుగో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించిందన్నారు. అమెరికా, సౌత్ కొరియా సహా విదేశాలు చైనా ప్లస్ దేశాల కోసం చూస్తున్నాయని, వాటికి ఈ నాలుగో నగరం వేదిక అవుతుందన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందాలంటే... అలాగే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలన్నారు.

ఏపీలో ప్రభుత్వం మారగానే... తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉంటుందని, హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని మాట్లాడారని పేర్కొన్నారు. కానీ తన పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కాదని... తన పోటీ ప్రపంచంతో అన్నారు. తన వద్ద హైదరాబాద్ నగరమే ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఉన్నాయన్నారు.

తాము పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచనను పక్కన పెట్టి ప్రపంచంతో పోటీ పడే విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. పక్క రాష్ట్రాలతో తమకు పోటీ లేదన్నారు. పక్క రాష్ట్రాల వద్ద హైదరాబాద్ వంటి నగరం లేదన్నారు. అన్నింటికంటే ఇక్కడున్న సానుకూల పరిస్థితులు ఎక్కడా లేవన్నారు. తమ వద్ద అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.