Maoist Leader RK Dies ?: మావోయిస్ట్ అగ్ర నేత ఆర్‌కె మృతిపై సస్సెన్స్, ఆయన మరణించారని చెబుతున్నపోలీసులు, ఇంకా ధ్రువీకరించని మావోయిస్టు పార్టీ, గత 3 ఏళ్ల నుంచి ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న రామకృష్ణ
Akkiraju Haragopal alias Ramakrishna. Photo: IANS

Hyd, Oct 15: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్‌కె (Senior Top Maoist leader RK) అనారోగ్యంతో కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన రామకృష్ణ తీవ్రమైన మధుమేహం, కీళ్ళనొప్పులు, కిడ్నీ సంబంధిత వ్యాధితో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ దక్షిణ బస్తర్‌ అడవుల్లో మృతి చెందినట్లుగా అనధికార సమాచారం. ఈ విషయాన్ని (Maoist Akkiraju Haragopal dies) ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధృవీకరించినట్లుగా తెలుస్తోంది.

మూడేళ్లుగా ఆయన ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటు మావోయిస్టుపార్టీ ఆయనన మృతిని (RK dead in Chhattisgarh) ఇంకా ధ్రువీకరించలేదు. ఆయన మరణించారన్న వార్తను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ‘ఆర్కే జాడలు తెలుసుకునేందుకు పోలీసులు పన్నిన కుట్ర ఇది’ అని ఆరోపిస్తున్నాయి. మోకాళ్ల నొప్పులు సహా పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మరణాన్ని కలిగించే స్థాయిలో లేవని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు.

ఏఎస్సై మురళిని చంపేసిన మావోయిస్టులు, మృతదేహం వద్ద బస్తర్‌ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ, మురళి హత్యను ఇంకా ధ్రువీకరించని పోలీసులు

వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీలో చేరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. పలు ఎన్‌కౌంటర్లలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు చెప్పుకుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతిచర్చల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 25 లక్షలు, ఛత్తీస్‌ఘ ప్రభుత్వం రూ. 40 లక్షలు, ఒడిసా ప్రభుత్వం రూ. 20 లక్షలు, జార్ఖండ్‌ ప్రభుత్వం రూ. 12 లక్షలు ఉన్నాయి

28 ఏళ్ల వయసులోనే విప్లవోద్యమంలోకి వెళ్లిన ఆర్కేకు భార్య శిరీష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. ఓ కేసులో అరెస్ట్‌ అయిన తర్వాత ఆమె బెయిలుపై విడుదలయి బహిరంగ జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్కే కుమారుడు మున్నా 2016లో ఏఓబీ పరిధిలోని రామ్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

విరసంతో సహా 16 మావోయిస్ట్ సంస్థలపై ఏడాది పాటు నిషేధం, ఈ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, 30 మార్చి 2021 నుండి నిషేధం అమ‌ల్లోకి వస్తుందంటూ ఉత్తర్వులు 

ఇదిలా ఉంటే బీజాపూర్‌ మావోయిస్టులకు కంచుకోట. ఈ ప్రాంతంపై ఛత్తీస్‌ఘఢ్‌-ఒడిసా సంయుక్త యాక్షన్‌ కమిటీ పర్యవేక్షణ ఉంటుంది. ఈ సీజన్‌లో ఆయన కరోనాబారిన పడి కోలుకున్నప్పటినుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారని ఛత్తీస్‌ఘఢ్‌ నక్సల్స్‌ ఏరివేత టాస్క్‌ఫోర్స్‌ విభాగం ప్రత్యేక అధికారి ఒకరు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ఆర్కేను నరాల సంబంధిత సమస్యలు తీవ్రంగా వెంటాడాయని, దానికి వైద్యం తీసుకోకపోవడం వల్లనే మరణించి ఉంటారని ఆ అధికారి పేర్కొంటున్నారు.

ఆర్కే మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో, పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. ఆ హోదాలో ఆయన ఆంధ్రా-ఒడిసా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ బాధ్యతలు చూస్తున్నారు. 2016 అక్టోబరు 24న ఏఓబీ కటాఫ్‌ ఏరియా పరిధిలోని రామ్‌గూడలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. 32 మంది మావోయిస్టులు ఈ ఘటనలో మరణించారు. ఈ సంఘటనలో ఆర్కేకు రెండుచోట్ల బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయన తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారని, చికిత్స తీసుకున్నాక ఏడాదిన్నరపాటు దండకారణ్యంలోనే విశ్రాంతి తీసుకున్నారని తెలిసింది.

2004లో నాటి పీపుల్స్‌వార్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్ర ఏపీ ప్రభుత్వంలో (దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయం) రాజకీయ చర్చలకు సిద్ధమైనప్పుడు ఆర్కే వెలుగులోకి వచ్చారు. చర్చల ప్రక్రియ ప్రారంభానికి ముందే రామకృష్ణ పేరుతో ఆయన కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవ్వాలి అని నాటి పీపుల్స్‌వార్‌, నేటి మావోయిస్టు నాయకత్వాన్ని ఒప్పించిందే ఆర్కే అని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఆ చర్చల్లో తుపాకీలు వీడాలని ఆ తరువాతే డిమాండ్లపై చర్చలు అని ప్రభుత్వం చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం హరగోపాల్ మళ్లీ అడవిబాట పట్టారు. చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు మాస్టర్ ప్లానర్‌గా ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.