Hyderabad, Dec 5: తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి (Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికల (Elections) తేదీ ఖరారైంది. ఈ నెల 27న ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు. హైకోర్టు (High Court) ఉత్తర్వుల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. సింగరేణిలోని 13 కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లోని కార్మికశాఖ ఆఫీస్ లో సోమవారం ఆయన భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం కుదరడంతో ప్రకటన చేశారు.
#TelanganaHighCourt postpones #Singareni Collieries Union elections to December 27, directs voters' list preparation by November 30. #TelanganaElections pic.twitter.com/3V95Py2Gt5
— Informed Alerts (@InformedAlerts) October 11, 2023
వాయిదా ఇందుకే
సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఇప్పటికే ముగియాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ఎన్నికలు -2023 కారణంగా వాయిదాపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో సింగరేణి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. కాగా 2017 సెప్టెంబర్ 5న జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది. మొత్తం 11 ఏరియాల్లో తొమ్మిదింటిని గెలుచుకొన్నది.