Hyderabad, September 24: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 55,318 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,176 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,257 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26,84,215 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,79,246కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 308 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 168, మేడ్చల్ నుంచి 151 కేసులు నిర్ధారణయ్యాయి.
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి
గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1070 కు పెరిగింది.
ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసురి వేణుగోపాల్ (Kosuri Venugopal) బుధవారం మృతిచెందారు. ఇటీవలే కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం మరింత విషమించి తుదిశ్వాస విడిచారు.
మరోవైపు, బుధవారం సాయంత్రం వరకు మరో 2004 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,48,139 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.