Representational Image of Indian workers in Gulf (File photo)

Hyderbad, Oct 7: గల్ఫ్‌ దేశాల్లో వేధింపులకు గురవుతున్న కార్మికుల పరిస్థితిపై (Gulf Workers) సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని, భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలివ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పిటిషనర్‌ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని చెప్పారు.జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం (Supreme Court) మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది.

కాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌.. గల్ఫ్‌ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోని వారికి సరైన జీతాలు చెల్లించకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, నకిలీ ఏజెంట్లు గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు.గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కార్మికులను ( Indian Workers From Gulf Countries) ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు.దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు.

నవంబర్ లేక డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటంతో ఆదేశాలు ఇవ్వలేమంటూ దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.