
Hyderabad, June 26: కరోనా రక్కసి విరుచుకుపడుతున్న వేళ సూర్యాపేటలో విషాదం (Suryapet Road Accident) చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్‌లో (Kasimpet road junction) శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ మరోసారి బంద్, ఈ నెల 28 నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రధాన బజార్లలో వ్యాపార సంస్థలన్నీ మూసివేత, కీలక నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్
మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన విజయకుమారి, సత్యానందం, జోసఫ్‌గా పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వైద్య చికిత్స నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాజీంపేట రోడ్ జంక్షన్ వద్ద నేషనల్ హైవే నెంబర్ 65 లో (National Highway No 65) యు-టర్న్ తీసుకుంటున్న సమయంలో బాధితులు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు సిమెంటు మిక్సింగ్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారు అతివేగంగా నడపడమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వారంతా క్యాన్సర్ రోగి అయిన విజయ కుమారిని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.