Hyderabad, June 26: తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌లో ( hotspot Hyderabad) కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారుల రద్దీని తగ్గించేందుకు వ్యాపారులు (Hyderabad traders) స్వచ్ఛందంగా మార్కెట్లను బంద్ చేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని బనారస్ పట్టు చీరల మార్కెట్‌ను బంద్ చేయగా, ఈ నెల 28 నుంచి జూలై 5 వరకు బేగంబజార్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో మూసివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. తెలంగాణపై కరోనా పంజా, ఒక్కరోజులోనే 920 కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 11 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ గురువారం సమావేశమై బేగంబజార్ మార్కెట్‌ను ఈ నెల 28 నుంచి జూలై 5వ తేదీ వరకు పూర్తిగా మూసేయాలని (HYD Voluntary ''lockdown') నిర్ణయించింది. గత కొన్నిరోజులుగా బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, షాహినాయత్‌గంజ్, మహారాజ్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ మార్కెట్లలో పలువురు వ్యాపారులకు కోవిడ్-19 రావడంతో మిగిలిన వారంతా వణికిపోతున్నారు.
ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు లాడ్ బజార్‌ను బంద్ చేస్తున్నట్లు లాడ్ బజార్ ట్రేడ్ యూనియన్ వ్యాపారులు తెలిపారు. 26వ తేదీ నుంచి జూలై 5 వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లో అన్నీ దుకాణాలు మూసివేయనున్నారు. ఈ శుక్రవారం నుంచి జూలై 5 వరకు బంగారం దుకాణాల స్వీయ లాక్‌డౌన్ పాటించనున్నామని సికింద్రాబాద్ గోల్డ్, సిల్వర్ జువెలరీ, డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బూరుగు సూర్యప్రకాష్, జగదీష్ ప్రసాద్ వర్మ తెలిపారు. అల్లనేరేడు మొక్కను నాటిన కేసీఆర్, నర్సాపూర్ నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం, ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వం లక్ష్యం
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎలక్ర్టికల్ మార్కెట్‌గా ఉన్న ట్రూప్ బజార్‌ను వచ్చే ఆదివారం నుంచి స్వచ్ఛందంగా బంద్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఈ మార్కెట్లలో జనాల రద్దీ బాగా పెరిగింది. పలువురు వ్యాపారులకు కరోనా వైరస్ సోకింది. ఈ క్రమంలోనే బేగంబజార్, ఫిల్‌ఖానా, సిద్ది అంబర్ బజార్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు దుకాణాలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా వ్యాపారులు స్వచ్ఛందంగా మార్కెట్లను మూసేస్తున్నారు.
ఈ మార్కెట్లో గత వారం రోజుల్లో 12 మంది వ్యాపారులకు కరోనా సోకిందని, అందులో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో వ్యాపార సంస్థలు మూసివేయాలని దుకాణాల యజమానులకు సమాచారం పంపించామని హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ తెలిపింది. ఎవరైనా దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేస్తే అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో ఒక్కరోజే మొత్తం 920 కరోనా కొత్త కేసులు (Covid-19 cases in Telangana) నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 737 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 86 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 60 కొత్త కరోనా కేసులను గుర్తించారు.