Haritha Haram Programme: అల్లనేరేడు మొక్కను నాటిన కేసీఆర్, నర్సాపూర్ నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం, ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వం లక్ష్యం
Telangana CM KCR Launched 6th Phase of Haritha Haram Programme At narsapur in Medak District (Photo-Telangana CMO Twitter)

Hyderabad, June 25: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ (narsapur in Medak District) అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నర్సాపూర్‌లో తెలంగాణ సీఎం అల్లనేరేడు మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని (6th Phase of Haritha Haram Programme) ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌లో అర్బన్‌ ఫారెస్ట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 891 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ, 225కి చేరిన మరణాల సంఖ్య

ప్రతీ ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పిలుపునిస్తోంది. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటే లక్ష‌్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

ఇందులో 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు చేపడుతున్నారు. గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం పెరుగుతోంది. రహదారుల వెంట చెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని స్పష్టం చేసింది.

Here's Telangana CMOTweets

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ గ్రామాన హరితహారం జోరుగా కొనసాగుతుంది.

Here's TRS Party Tweet

సీఎం కేసీఆర్ ప్రారంభించిన నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌లో అనేక విశిష్టతలున్నాయి. ఇది ఐదు అటవీ కంపార్ట్‌మెంట్‌లలో 4,380 ఎకరాల అటవీ ప్రాంతం. 630 ఎకరాల్లో ఫారెస్ట్‌ పార్క్‌ ఉన్నది. ఇందుకోసం రూ.8 కోట్ల వ్యయంచేశారు. 15 కిలోమీటర్ల మేర రక్షణ ప్రహరీ (సీ త్రూ వాల్‌, చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌)తో నిర్మాణం జరిగింది.  ఈ అటవీ ప్రాంతం 256 పక్షి జాతులకు నిలయంగా ఉన్నది. తెలంగాణలో 434 పక్షి జాతులుండగా.. అందులో 60 శాతం నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోనే ఉండటం విశేషం. ఇక్కడ ఉండే 256 పక్షి జాతుల్లో 173 స్థానికమైనవి. మిగతా 83 రకాలు వలస పక్షులు. ఇవి వేసవి, శీతాకాలంలోనే ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి.

 Here's TS Ministers Haritha Haram Programme

ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌' అనే నినాదంతో ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బోయిగూడలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును మంత్రి ప్రారంభించారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా పార్కులో మొక్కలు నాటారు. అనంతరం బల్కంపేట శ్మశాన వాటికలో, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు ఎగ్జిట్‌ నంబర్‌ 5 వద్ద మొక్కలు నాటారు. ఈ ఏడాది హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 12.5 కోట్ల మొక్కలు నాటనున్నామని చెప్పారు.

Here's TS Ministers Haritha Haram Programme

Here's HYD CP Anjani Kumar  Haritha Haram Programme

ఆరో విడ‌త తెలంగాణ‌కు హ‌రితహారం కార్యక్రమంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హ‌రితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని లకారం మినీ ట్యాంక్ బండ్ పై వెయ్యి మొక్కలు, వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్కులో 117 ఎకరాల్లో 57,700 మొక్కలను నాటే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

హ‌రిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గీసుకొండ మండ‌లం మ‌రియపురం క్రాస్ రోడ్డు నుంచి చేల‌ప‌ర్తి గ్రామం వ‌ర‌కు 14కి.మీ. మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ హరిత హారంలో నాటిన మొక్కలను వంద శాతం బతికించాలన్నారు. మొక్కలను సంరక్షించని ప్రజాప్రతినిధులు, అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలను రక్షించడమే ధ్యేయంగా గ్రామాల్లో పని చేయాలని ఆయన సూచించారు.