Corona in Telangana: తెలంగాణపై కరోనా పంజా, ఒక్కరోజులోనే 920 కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 11 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, June 26: తెలంగాణలో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారీస్థాయిలో 920 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 11,364 కు చేరుకుంది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితులు రోజురోజుకి మరింత దిగజారుతున్నాయి.  గురువారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 737 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. కరోనా ధాటికి హైదరాబాద్ లోని పలు వర్తక సంఘాలు ఈ ఆదివారం నుంచి వారం రోజుల పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసియాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమకు తాముగా లాక్డౌన్ విధించుకున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ తరువాత నగర శివారు ప్రాంతాల్లోనూ విరస్ వేగంగా ప్రబలుతోంది. నిన్న రంగారెడ్డి జిల్లా  నుంచి 86, మేడ్చల్ నుంచి 60 పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కూడా ఇటీవల కాలంలోనే అత్యధికంగా గురువారం 13 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Update:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న మరో 5 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 230 కు పెరిగింది.

ఇదిలా ఉంటే, ఈరోజు మరో 327 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,688 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,446 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,616 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70,934 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.