Representational Image | (Photo Credits: IANS)

Hyd, May16; ప్రభుత్వాలు బాల్య వివాహాలపై కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. చిన్నారులకు పెండ్లి చేస్తూ వారి జీవితాలను ఆగమాగం చేస్తున్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నా వాటిని పెడచెవిన పెట్టి కొందరు గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో 12ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం జరిపించారు ఆ బాలిక తల్లిదండ్రులు.

పుట్టిన రోజు వేడుక పేరుతో 35ఏళ్ల వ్యక్తికి 12ఏళ్ల చిన్నారిని ఇచ్చి పెండ్లి చేశారు. అనంతరం పెళ్లి ఇష్టం లేదని చెప్పిబాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారిని పంపించాలని తల్లిదండ్రులు వాగ్వివాదంకు దిగారు. ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. బాల్య వివాహం అని నిర్ధారించుకొని విషయాన్ని కేశంపేట పోలీసులకు తెలియజేశారు.

కామాంధుడైన 80 ఏళ్ళ వృద్ధుడు, బాలికపై ఏడేళ్ల నుంచి అసహజరీతిలో అత్యాచారం, డిజిటల్ రేప్ కింద కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు

ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలికను పెండ్లి చేసుకొనేందుకు సిద్ధమైన వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. కాగా బాలికను ఐసీడీఎస్ సిబ్బంది తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.