Shamshabad Road Accident: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు అక్కడిక్కడే మృతి, మరో ఆరుగురు లారీ కింద..లారీలో 30 మందికి పైగా కార్మికులు, కారును ఢీకొట్టి లారీ బోల్తా
Road accident (image use for representational)

Hyderabad, April 18: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Shamshabad Road Accident) జరిగింది. కారును ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 15 మందికి పైగా తీగ్రగాయాలయ్యాయి. మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కుపోయారు.

ప్రమాద సమయంలో లారీలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీ కింద ఇరుక్కున్న కార్మికులను బయటకు తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ రోజు ఉదయం అఫ్జల్‌గంజ్‌లోని కేంద్ర గ్రంథాలయం ఎదురుగా ఉన్న పెట్రోల్‌ పంప్‌ వెనుక ఓ పాత టైర్ల గోదాములో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి అక్కడ భారీగా నిల్వ చేసిన పాత టైర్లకు అంటుకోవడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో టైర్లు కాలి బూడిదయ్యాయి.

ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌

అఫ్జల్‌గంజ్‌ పరిసర ప్రాంతాల్లో చాలాసేపు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనదారులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఉస్మాన్‌షాహీ ప్రాంతానికి చెందిన కొంతమంది పాత టైర్ల వ్యాపారులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖకు, అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న పెట్రోల్‌ పంప్‌ను మూసివేయించారు. దాదాపు 15 ఫైరింజన్లతో సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ.4.5 లక్షల విలువ చేసే పాత టైర్లు దగ్ధమయ్యాయని తెలుస్తోంది.