COVID Vaccination Representative Image

Hyd, Dec 29: తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వందశాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ (COVID Vaccination in Telangana) అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామన్నారు. వ్యాక్సినేషన్ పై (COVID Vaccination) మొదట్నుంచీ సీఎం ప్రత్యేక దృష్టి సారించి, స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని మంత్రి (Harish Rao) తెలిపారు.

ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వ్యాక్సినేషన్ లో భాగస్వామ్యమయ్యాయని తెలిపారు. తెలంగాణలో 7970 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనాను అరికట్టడంలో వ్యాక్సినే సంజీవని అని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలిన తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందన్నారు.

తెలంగాణలో జనవరి 3 నుంచి పిల్లలకు కోవిడ్ టీకాలు, కొత్తగా మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు, 62కు చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య

వచ్చే జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. 15-18 ఏళ్ల మధ్య ఉన్నవారికి టీకా వేస్తామన్నారు. కొవిన్ పోర్టల్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్, పురపాలికల్లో కోవిన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్ సీలు, వైద్య కాలేజీల్లో టీకాలు వేయనున్నట్లు తెలిపారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. అర్హులైన పిల్లలందరికీ కోవాగ్జిన్ టీకా వేస్తామని, కోవాగ్జిన్ టీకాను కేంద్రం సూచించిందని తెలిపారు. రాష్ట్రంలో 15-18 ఏళ్ల పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని, 61 ఏళ్లు దాటినవారు 41.60 లక్షల మంది ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.